ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సత్తా ఉంటే తక్షణం ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని, బీజేపీకి 10 కంటే ఎక్కువ సీట్లు వస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకొంటానని మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీని బీజేపీ నాశనం చేసింది. ఇక్కడ అధికారం చేపట్టాలనే ఆశతో మూడు కోట్ల ఢిల్లీ ప్రజల్ని ఇబ్బందుల్లో నెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీని తొలగించేందుకు దేశంలోనే అతిపెద్ద రాజకీయ కుట్రకు బీజేపీ తెరలేపింది. దేశంతో, రాజ్యాంగంతో ఆటలాడుకున్నారు అంటూ కేజ్రీవాల్ మాట్లాడారు.

