ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. సోనియా గాంధీకి ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను అందజేశారు. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, రాష్ట్రంలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ (YIIRS) ఏర్పాటుకు సహకరించాలని కోరారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు హైదరాబాద్‌కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM) మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధి, విద్య, ఆర్థిక అంశాలపై ముఖ్యమంత్రి ఈ సమావేశాల్లో చర్చించారు.

