దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత స్థాయిలు మరింత దిగజారుతున్నాయి. దీంతో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. ఆప్, కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు ఢిల్లీ వాసులు ఇండియా గేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జీవించే హక్కు తమకు ఉన్నదని నినాదాలు చేశారు. దేశ రాజధానిలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోనేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.

