దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెరీ పూర్ కేటగిరీల నమోదైంది. గురువారం ఉదయం నగరంలో ఓవరాల్ AQI 352గా ఉంది. వాయు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఉదయం 8 గంటల సమయానికి వివేక్ విహార్లో ఏక్యూఐ 415, ఆనంద్ విహార్లో 408గా నమోదైంది. ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు.

