దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత పూర్ కేటగిరీలో నమోదైంది. శనివారం ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలో ఓవరాల్ ఏక్యూఐ (AQI) లెవెల్స్ 245గా నమోదైంది. అత్యధికంగా వాజీపూర్‌లో గాలి నాణ్యత సూచిక 328గా, బావనా ప్రాంతంలో 301గా నమోదైంది. జహంగిరిపురి వద్ద 300, చాందినీ చౌక్ వద్ద 299, ఆర్కే పురం వద్ద 298, గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు.

