స్వాతంత్ర్య దినోత్సవం మధ్య దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. హజ్రత్ నిజాముద్దీన్ ఏరియాలోని హుమాయున్ సమాధి ప్రాంగణంలో ప్రమాదం జరిగింది. దర్గా పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది మరణించారు. 12 మందికి గాయాలయ్యాయి. మరో 11 మందిని సురక్షితంగా బయటపడ్డారు. గాయాలైన వారిని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని హుమాయున్ సమాధి వెనుక ఉన్న పట్టేషా దర్గా 2 గదులు కూలిపోయాయి. NDRF సహాయక చర్యలు చేపట్టాయి.

