
తెలంగాణలో రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎవరు ఎంత చేశారో తేల్చుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలను బహిరంగ చర్చకు ఆహ్వానించారు. “ కేడీ గల్లీలో ఉన్నా, మోడీ ఢిల్లీలో ఉన్నా… రైతు సమస్యలపై ముఖాముఖీకి రావాలండి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేవలం తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం తమ ప్రభుత్వ విజయాన్ని చూపుతున్నదని సీఎం స్పష్టం చేశారు.