మొబైల్ వినియోగదారుల రోజువారీ డేటా వినియోగంపై రాజ్యసభలో ఆసక్తికర చర్చ జరిగింది. మనం డబ్బులు చెల్లించి కొనుగోలు చేసిన డేటా, వాడకపోతే ఎందుకు రద్దయిపోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టెలికాం సంస్థలు అనుసరిస్తున్న ఈ విధానం వల్ల సామాన్య వినియోగదారులు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “వినియోగదారులు పూర్తి మొత్తానికి డబ్బులు చెల్లించినప్పుడు, వాడని డేటాను తర్వాతి రోజుకు ఎందుకు బదిలీ చేయకూడదు?” అని రాఘవ్ చద్దా ప్రశ్నించారు.

