ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ డీలిమిటేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్ సభ సీట్లను కోల్పోతాయని వస్తోన్న వాదనలు అవాస్తవమని వెల్లడించారు. జనాభా సంఖ్య తగ్గితే ఎంపీ సీట్లు కోల్పోతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వల్ల కేరళ, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేశారు.

