
రాష్ట్రంలోని డీమ్డ్ వర్సిటీలపై ‘సెక్షన్ 20 ఎడ్యుకేషన్ యాక్ట్’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించనున్నది. ఈ యాక్ట్ ప్రకారం విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. యూజీసీ ఇష్టారీతిన పలు వర్సిటీలకు ప్రైవేట్, డీమ్డ్ హోదాను కల్పిస్తున్నది. ఈ వర్సిటీలపై మొదటినుంచీ సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉన్నది. ఇటీవలే ఇదే అంశం హైకోర్టుకు కూడా చేరింది. అయితే కోర్టు తుది ఉత్తర్వులివ్వలేదు. ఇటీవలే హైకోర్టు అటు డీమ్డ్ వర్సిటీలు, ఇటు ప్రభుత్వాన్ని జూన్‌లోపు అఫిడవిట్లు ఫైల్ చేయాలని ఆదేశించింది.