ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీ.. అసలు టార్గెట్ ఇప్పుడు కాదని.. డిసెంబర్ 6వ తేదీ అని తేలింది. 1996 డిసెంబర్ 6వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు సందర్భంగా.. ఈ ఏడాది డిసెంబర్ 6వ తేదీన భారీ మొత్తంలో పేలుళ్లకు పాల్పడేందుకు ప్లాన్ చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితేఈ ప్లాన్‌లో భాగంగా పేలుడు పదార్థాలను తరలిస్తుండగా.. అనుకోకుండా ఈ పేలుడు జరిగినట్లు గుర్తించారు.

