ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాల్లో పేకాట కల్చర్ పెరిగిపోయిందని భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన అంశంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు.
గోదావరి జిల్లాలో పేకాట ఆడటం సహజమని ఆయన అన్నారు. అయినా కూటమి ప్రభుత్వం పేకటపై ఉక్కుపాదం మోపిందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. భీమవరం డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు.

