డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు డీఎస్పీపై వచ్చిన ఆరోపణల విషయంలో తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. తాను పవన్ కల్యాణ్ అభిమానినని పేర్కొంటూ, డీఎస్పీ అంశంపై పవన్ అభిమానులు తనను అపార్థం చేసుకుంటున్నారని వాపోయారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై తనకు అందిన సమాచారం తప్పై ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని రఘురామకృష్ణ రాజు ఆశాభావం డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అంటూ పలు థంబ్నెయిల్స్ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. దీనిపై ఇంటర్నెట్లో పెద్ద చర్చ జరుగుతోంది.

