
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తల మీద కూటమి ప్రభుత్వం ప్రతాపం చూపిస్తుందని ఆరోపించారు. రెడ్ బుక్ పేరుతో వైసీపీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న నారా లోకేష్, కూటమి నాయకులకు డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో సిగ్గు లేకుండా సభ పెట్టుకుందని తీవ్ర విమర్శలు చేశారు.