
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకొచ్చిన డిజిటల్ రూపీ ఇది మనదేశంలో డబ్బు వాడకాన్ని పూర్తిగా మార్చేయబోతున్నది.. డిజిటల్ రూపీతో మరో ముందడుగు వేయనున్నది. డిజిటల్ రూపీ అంటే ఆర్బీఐ తయారుచేసిన ఒక డిజిటల్ డబ్బు. ఇది కరెన్సీ లాంటిదే! దీని విలువ కూడా మన కరెన్సీతో సమానమే!అంటే 1 డిజిటల్ రూపీ 1 రూపాయికి సమానం. కాకపోతే మన ఫోన్లో ఉంటుంది. ఈ డబ్బును ఆర్బీఐ నేరుగా ఇస్తుంది. బిట్ కాయిన్‌లాంటి ప్రైవేట్ కరెన్సీలతో పోలిస్తే ఇది చాలా సురక్షితం.