సైబర్ భద్రతపై మెరుగైన అవగాహన కల్పించేందుకు ఇక సాధారణ డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులకు దీన్ని బోధించనున్నారు. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో సైబర్ భద్రతను
బోధనాంశంగా పరిచయం చేస్తున్నాయి. డిగ్రీ స్థాయిలో సాంకేతిక అంశాల కింద 20 శాతం సైబర్ భద్రత పాఠాలు బోధించి, సెమిస్టర్ పేపర్లలో చేర్చాలంటూ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) యూజీసీ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది.

