సృష్టి సరోగసీ అక్రమాల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.దాదాపు రూ. 50 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు మంగళవారం ప్రకటించారు. సృష్టి కేసులో సీసీఎస్ పోలీసుల విచారణ తర్వాత.. ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

