
సైబర్ నేరగాళ్లు ట్రేడింగ్ ఫ్రాడ్‌కు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఒక్క కమిషనరేట్ పరిధిలోనే రోజుకు కోటి, రెండు కోట్లు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 కోట్ల వరకు కేవలం ట్రేడింగ్‌కు సంబంధించి మోసాలకు పాల్పడుతున్నారు.
సైబర్‌నేరగాళ్లు.. తమ సొంత యాప్‌లు, వెబ్సైట్లలో లాగిన్ ఐడీలు ఇచ్చి అందులో నుంచే స్టాక్స్ కొనిపిస్తున్నారు. యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాలను బాధితులకు పంపిస్తూ ఆయా ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయాలని సూచనలు చేస్తున్నారు.