
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 2.0 పాలనలో సంచలనలకు కేంద్ర బిందువుగా మారారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దూకుడుగా వ్యవహరిస్తూ.. అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా, ఆయన ఏకంగా విద్యాశాఖనే మూసివేశారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వులతో ఫెడరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ శాశ్వతంగా తొలగించడం మొదలైందని ట్రంప్ అన్నారు. ‘‘మేము వీలైనంత త్వరగా మూసివేస్తాం.. దీని వల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు.. విద్యను రాష్ట్రాలకు తిరిగి అప్పగించబోతున్నాం’’ అని వ్యాఖ్యానించారు.