ఇరాన్‌తో యుద్ధం ఇంకా తీవ్రతరం కానుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి. ట్రంప్ ప్రసంగానికి ముందు 100 పాయింట్ల లాభంలో ఉన్న గిఫ్ట్ నిఫ్టీ.. 7.53 గంటలకు 496 పాయింట్లు కోల్పోయింది. ముడి చమురు ధరలు 4 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లపై ఈప్రభావం గణనీయంగా పడనుంది. భారీ గ్యాప్ డౌన్‌తో ట్రేడింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

