
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత ఉక్రెయిన్-రష్యా యుద్ధ విరామ చర్చలపై కొత్త ఆశలు చిగురించాయి. ఈ చర్చల గురించి ట్రంప్ మాట్లాడుతూ… పుతిన్ మంచివాడని, ఆయనతో మాట్లాడిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. చాలా కాలంగా జరుగుతున్న ఈ సంఘర్షణకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందనే ఆశలు పెరిగాయి.