
సికింద్రాబాద్‌లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై శనివారం నార్త్ జోన్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ మహిళ తన భర్త వీర్యకణాలతో సంతానం పొందాలని ఆశించి ఈ కేంద్రాన్ని ఆశ్రయించగా, వైద్యులు మరో వ్యక్తి వీర్యంతో గర్భధారణ జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. దంపతులకెంతో నిరీక్షణ అనంతరం ఓ మగ బిడ్డ పుట్టాడు. కానీ కొన్ని నెలలకే బాబు అనారోగ్యంతో బాధపడుతూ క్యాన్సర్ నిర్ధారణ కావడంతో వారు అనుమానించారు. డీఎన్ఏ పరీక్ష చేయించగా, పిల్లవాడికి తండ్రి డీఎన్ఏ సరిపోలకపోవడం తేలింది.