ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. గురువారం మార్గదర్శకాలు, షెడ్యూలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ఎయిడెడ్ మేనేజ్‌మెంట్ల పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో టీచర్ ఉద్యోగం చేయాలనుకునేవారు కూడా టెట్ ఉత్తీర్ణత సాధించాలని స్పష్టంచేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు 1ఎ, 1బి, 2ఎ, 2బి నాలుగు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఒక్కో పేపరుకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని పేర్కొంది.

