
ఫ్రాంచైజీ క్రికెట్‌కు క్రేజ్ పెరగడంతో మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించేందుకు కొందరు బుకీలు ప్రయత్నిస్తున్నారు. తాజాగా యూపీ టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. కాశీ రుద్రాస్ ఫ్రాంచైజీ యజమాని అర్జున్ చౌహన్‌కు ఒక బుకీ (Bookie) ఏకంగా భారీగా డబ్బులు ఆఫర్ చేశాడు. తాను చెప్పినట్టుగా చేస్తే రూ.1 కోటి ఇస్తానని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. దాంతో.. సదరు బుకీపై అర్జున్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.