టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తిరుమల పర్యటనలో బీఆర్ నాయుడును చంద్రబాబు దూరం పెట్టినట్లు నటించారని, ఇదంతా ఒక పెద్ద నాటకమని ఆయన ఆరోపించారు. బీఆర్ నాయుడు ఏ టెక్నాలజీతో మాయమయ్యాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. కనీసం ఒక అటెండర్ కూడా పట్టించుకోని వ్యక్తిగా బీఆర్ నాయుడును అభివర్ణించిన భూమన, దేవాలయ ప్రతిష్టను కాపాడాలంటే ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. భగవంతుడి విషయంలో చంద్రబాబు రాజకీయం చేయడం తగదని హెచ్చరించారు.

