బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను మళ్లీ టీఆర్ఎస్గా మార్పు చేసే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. 2027 నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇక పార్టీ పేరు మార్పుపై వస్తున్న వార్తలపై కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ను తిరిగి టీఆర్ఎస్గా మార్చాలనేది ప్రజల నుంచి వస్తున్న బలమైన కోరిక అని అయితే పార్టీలో నిర్ణయాలన్నీ కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతాయని అన్నారు. ఆయన ఏది చెబితే అదే ఫైనల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు.

