
చైనాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ టిక్ టాక్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోన్నారు. టిక్‌టాక్‌ను అమెరికా నిషేధించిన విషయం తెలిసిందే. యాప్ మాతృ సంస్థ బైట్ డాన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం దక్కలేదు. యూఎస్ కంపెనీ జాయింట్ వెంచర్‌గా 50 శాతం వాటాను టిక్ టాక్ మాతృసంస్థలో కలిగి ఉంటుందని నిబంధనను పెట్టారు. గడువు ముగియబోతోన్న నేపథ్యంలో- దీన్ని మరో 75 రోజుల పాటు పొడిగించినట్లు వెల్లడించారు.