
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని ఎంపీ చిన్నీని టార్గెట్ చేశారు. తనకు టికెట్ ఇప్పించేందుకు ఐదు కోట్లు అడిగారని ఆరోపించారు.
మూడు దఫాలుగా అరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్పారు. మరో 50 లక్షల రూపాయలను చిన్ని పీఏకు ఇచ్చినట్టు తెలిపారు. మిగిలిన డబ్బులు గురించి రేపు వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. నిజం గెలవాలి నిజమే గెలవాలని అన్నారు.