
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆసియా కప్ భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడిన హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను జట్టులోకి తీసుకోలేదు.