టాటా మోటార్స్ ఇప్పుడు ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశిస్తుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అందరికీ అందుబాటు ధరల్లో 125CC కమ్యూటర్ బైక్‌ను తీసుకొస్తోందని.. దానికి సంబంధించిన పోస్టర్ అంటూ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాక్ట్ చెక్ చేసి ఏఐ జెనరేటెడ్ ఇమేజ్ అని తేల్చుతున్నారు. ఇప్పటివరకు టాటా మోటార్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. కంపెనీ అధికారికంగా ప్రకటించేవరకు ఎలాంటివి నమ్మకపోవడమే మంచిది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అర్థం చేసుకోవచ్చు.

