
టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పదవీకాలాన్ని టాటా ట్రస్ట్ మరోసారి పొడిగించింది. ఆయన మరో ఐదేండ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ పదవి కాలాన్ని పొడగించడం ఇది మూడోసారి కావడం విశేషం. దీంతో 2032 వరకు ఆయన టాటా సన్స్ చైర్మన్‌గా కొనసాగనున్నారు.దీంతో కంపెనీలో 65 ఏండ్లకు పదవీ విరమణ పాలసీని బ్రేక్ చేసినట్టు అవనున్నది. 2017లో తొలిసారిగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్.. మరోసారి 2022లో పొడగించారు.