
బీహార్లోని గయాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. జైలు నుంచి ఎందుకు ప్రభుత్వాన్ని నడపాలి అని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగిని 50 గంటల పాటు జైలులో వేస్తే, అప్పుడు ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని
కోల్పోతున్నాడని, కానీ సీఎం, మంత్రులు.. జైలులోనే ఉంటూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని, కొందరు జైలు నుంచే ఫైళ్లపై సంతకాలు చేసేవారని, జైలు నుంచే ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చేవారన్నారు. ఒకవేళ ప్రజానేతకు అటువంటి వ్యక్తిత్వం ఉంటే, అప్పుడు మనం అవినీతిని ఎలా ఎదుర్కుంటామని ప్రధాని ప్రశ్నించారు.