ఏఎస్పీ రోహిత్‌పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ జగదీష్ స్పందించారు. ప్రభాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదని హితవుపలికారు. ఇలా బెదిరింపు ధోరణితో మాట్లాడటం చట్టరీత్యా నేరమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గన్ లైసెన్స్ పైనా లీగల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్‌పై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన తెలిసిందే.

