
తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రజెంటేషన్‌లో KTR ఓటర్ లిస్టులోని అవకతవకలను పవర్‌పాయింట్ స్లైడ్‌లు, డాక్యుమెంట్లతో సహా వివరించారు. జూబ్లీహిల్స్‌లో సుమారు 20,000 డూప్లికేట్ మరియు ఫేక్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. ఇందులో 15,000 ఓట్లు చిరునామాలు లేకుండా నమోదు అయ్యాయి. సుమారు 400 పోలింగ్ బూత్‌లలో ప్రతి బూత్‌కు 50 ఫేక్ ఓట్లు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, లోయర్ లెవల్ అధికారులతో కలిసి ఫేక్ ఓట్లు యాడ్ చేసిందని ఆరోపించారు.