జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు ఓటర్లకు డబ్బులు పంచే కార్యక్రమాలను మొదలుపెట్టింది. షేక్‌పేట డివిజన్ ఎల్లారెడ్డిగూడలో బహిరంగంగానే డబ్బుల పంపిణీని ప్రారంభించింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి చీరలు, డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు ఎర్రగడ్డలోనూ కాంగ్రెస్ నాయకులు భారీగా డబ్బులు పంచేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం హోటల్ పాలక్‌లో సమావేశమయ్యారనే సమాచారం తెలిసిన పోలీసులు రైడ్ చేశారు. దాదాపు 11 మందిని అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

