జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ వద్ద స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ పనుల దృష్ట్యా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేను అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ట్రయల్ రన్ నిర్వహించారు. కేబీఆర్ పార్క్ వద్ద ఎడమ వైపునకు మళ్లించారు. అక్కడి నుంచి తెలంగాణ భవన్, సీవీఆర్ జంక్షన్, బాలకృష్ణ నివాసం మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వెళ్లే విధంగా ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు.

