
ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. హరి హర వీరమల్లు చిత్రం జూన్ 12న బాక్సాఫీ స్ దగ్గర గర్జించనుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా.. ప్రేక్షకుల హృదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.