గుంటూరులో ఆక్స్‌ఫర్డ్ కాలేజీ 15 మంది విద్యార్థులు కాలేజీ డీన్ మురళీకృష్ణారెడ్డి వద్ద పీఏగా పనిచేస్తున్న మూర్తికి డబ్బులు ఇచ్చి జేఈఈ మెయిన్స్ సెషన్ 2 దరఖాస్తు చేయాలని కోరారు. అతను దరఖాస్తు చేయకపోగా విద్యార్థులకు నకిలీ అడ్మిట్ కార్డులు ఇచ్చినట్లు విద్యార్ధులు తెలిపారు. మే నెలలో నీట్ పరీక్షకు కూడా 12 మంది విద్యార్ధులు దూరమయ్యే పరిస్థితి దాపురించింది. విద్యార్ధుల వద్ద డబ్బులు వసూలు చేసి, వారి భవిష్యత్తును అంధకారం చేసిన సదరు మూర్తిని కఠినంగా శిక్షంచాలని విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

