తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలకు ఇది ఊరట కలిగించే పరిణామం. ‘కొమురంభీమ్ కన్జర్వేషన్ కారిడార్’ పేరిట జారీ చేసిన జీవో 49 (GO 49)ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.జీవో 49కు సంబంధించి ఆదివాసీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు సాగుతున్నాయి.

