తెలంగాణలో భౌగోళిక గుర్తింపు పొందిన కళలకు మరింత ప్రాచుర్యం కలిగించేలా ప్రభుత్వం ఆర్టీసీ సమన్వయంతో హైదరాబాద్లోని ఎంజీ బస్టాండ్లో ‘G.I ఆన్ వీల్స్’ పేరిట వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్టాండ్‌లోగవర్నర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 6 జీఐ ట్యాగ్లు ఉన్నాయి. పొచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నిర్మల్ పెయింటింగ్ చిత్రాలతో బస్సులపై ప్రచారం కల్పించేలా ఆర్టీసీ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు.

