
జీఎస్టీ, ఆదాయపు పన్ను తగ్గింపు వల్ల ప్రజలు గతంలో రూ.2.5 లక్షల కోట్లు ఆదా చేసుకున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాజా జీఎస్టీ 2.0 సంస్కరణలతో వ్యాపారాలు సులభతరం అవుతాయని, పెట్టుబడులు ఆకర్షణీయంగా మారతాయని ఆయన పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలపై నేడు జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. నవరాత్రి తొలిరోజు నుంచి ‘జీఎస్టీ బచత్ ఉత్సవ్’ ప్రారంభమవుతుందని..ఇది పేదలకు, మధ్యతరగతి ప్రజలకు డబుల్ బొనాంజా ఇస్తుందని ప్రధాని అన్నారు.