
పాకిస్థాన్‌లో బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్ ను లక్ష్యంగా చేసుకొని భీకర దాడికి పాల్పడింది. సింధ్-బలూచిస్థాన్ సరిహద్దుకు సమీపంలో గల సుల్తాన్‌కోట్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌పై ఐఈడీ బాంబులు అమర్చి పేల్చింది.
ప్రమాద సమయంలో పాక్ ఆర్మీ సిబ్బంది రైలులో ప్రయాణిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పేలుడు దాటికి అనేక మంది సైనికులు మరణించినట్లు పేర్కొంది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. బలూచిస్థాన్‌కు స్వాతంత్య్రం వచ్చే వరకూ ఇలాంటి దాడులు కొనసాగుతాయని ఈ సందర్భంగా హెచ్చరించింది.