జాతీయ టీకా దినోత్సవం (National Vaccination Day) భారతదేశం లో ఏటా మార్చి 16న నిర్వహిస్తారు. దీన్నే జాతీయ రోగనిరోధక దినోత్సవం (National Immunization Day) అని కూడా అంటారు. టీకాలు ప్రజారోగ్యంలో ముఖ్య భాగం. వ్యక్తులు, సమాజాన్ని అంటువ్యాధుల నుంచి రక్షించడంలో ఇవి చాలా అవసరం. వివిధ బ్యాక్టీరియా, వైరస్ మానవులకు చేరకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి సాయం చేస్తాయి. టీకాల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యం

