
ఖేల్ రత్నా, అర్జున అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. అక్టోబర్ 28వ తేదీలోగా ఆ దరఖాస్తులను అందజేయాలని ప్రభుత్వం కోరింది. ప్రతి ఏడాది క్రీడా అవార్డులను రాష్ట్రపతి అందజేస్తారు. వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు అర్హులైన క్రీడాకారులు, కోచ్లు,సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ శాఖ కోరింది. మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు,అర్జున, ద్రోణాచార్య, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ అవార్డులను కూడా ప్రజెంట్ చేస్తారు.