
రాష్ట్రంలోని జల వనరులను సద్వినియోగం చేసుకుంటూ, జల విద్యుత్ కేంద్రాల్లో అన్ని యూనిట్లను ఉపయోగంలోకి తీసుకువస్తూ డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇందన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జున సాగర్ డ్యాం ప్రధాన జల విద్యుత్ కేంద్రంను శుక్రవారం ఆయన సందర్శించారు. రాష్ట్రంలోని జల విద్యుత్ ప్రాజెక్ట్‌లలో ఉపయోగంలో లేని యూనిట్లను ఉపయోగంలోకి తేవాలన్నారు.