జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్ర్ మనోజ్ సిన్హా మనవడు ఆరవ్ మిశ్రా తన కుటుంబంతో కలిసి కాన్పూర్‌లోని తన నివాసంలో ఉంటున్నాడు. అలోక్ మిశ్రా కుమారుడు అయిన ఆరవ్ మిశ్రా జైన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్ చదువుతున్నాడు.తల్లి, సోదరి ఇద్దరూ ఛాత్ పూజాలో పాల్గొనేందుకు భగల్‌పూర్ వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆరవ్ మిశ్రా బలవన్మరణానికి పాల్పడ్డాడు.పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అయితే ఆరవ్ మిశ్రా గదిని తనిఖీ చేయగా సూసైడ్ నోట్ లభించింది.

