
జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖ పంపించారు. ఇది హోదా పునరుద్ధరణే అవుతుందని వివరించారు. 21 నుంచి ఆరంభమమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాసంపూర్ణ స్థాయిలో దక్కేలా చేసేందుకు తగు బిల్లు తీసుకువచ్చి, చట్టం రూపొందించాలని ఈ లేఖలో వీరిరువురు తెలిపారు.