జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి మళ్లీ డ్రోన్ల కదలికలు భద్రతా దళాలను ఉలిక్కిపడేలా చేశాయి. రాజౌరి జిల్లాలోని కేరి సెక్టార్, దూంగా గాలి ప్రాంతాల్లో అర్థరాత్రి సమయంలో అనుమానాస్పద డ్రోన్లు సంచరించినట్లు నివేదికలు అందాయి. శత్రు దేశం నుండి వచ్చిన ఈ డ్రోన్ల ద్వారా ఆయుధాలు లేదా మాదకద్రవ్యాలను తరలించే అవకాశం ఉందన్న అనుమానంతో సైన్యం అప్రమత్తమైంది. రాజౌరి సెక్టార్‌లో గత 48 గంటల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.

