
జమిలి ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది బీజేపీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. మాటిమాటికి వచ్చే ఎన్నికలతో వచ్చే నష్టాన్ని వివరించాలని ఎంపీలకు సూచించారు జేపీ నడ్డా. మరోవైపు ఆఫీస్ బేరర్స్, జిల్లా అధ్యక్షులతో భేటీ అయిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ హామీల అమలుపై ప్రజా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దేశమంతటా ఒకేసారి లోక్‌సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగితే నిర్వహణ వ్యయం, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రభుత్వాల పనికి అంతరాయం ఉండదన్నారు.