
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో మొదటి రోజునే ఒక ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. జపాన్లో ఆధ్యాత్మికతకు, సంప్రదాయాలకు ప్రతీకగా భావించే దరుమా బొమ్మను దరుమాజీ ఆలయ ప్రధాన పూజారి రెవ్ సైషీ హిరోసే మోదీకి అందజేశారు. జపాన్లో దరుమా బొమ్మను అదృష్టం, పట్టుదల ప్రతీకగా భావిస్తారు. ఈ బొమ్మను సాధారణంగా కాగితపు గుజ్జుతో తయారు చేస్తారు. దీని కింద భాగం గుండ్రంగా ఉండటం వల్ల కింద పడినా వెంటనే లేచి నిలబడుతుంది.